Telangana Another good news for the unemployed.. Notification for filling 16,940 posts soon 2022-23
Telangana govt jobs 2022-23
కొలువుల జాతరకు తెలంగాణ సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సర్కారు వేగంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలు శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీకి నోటీషికేషన్ ఇచ్చిన ప్రభుత్వం.. తాజాగా మరో 16 వేల 940 పోస్టుల భర్తీకి త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. నాలుగు రోజుల కిందే.. 9 వేలకు పైగా గ్రూప్-4 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన సర్కారు.. ఇప్పుడు ఈ వార్త వినిపించటంతో.. నిరుద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
ప్రధానాంశాలు:
- తెలంగాణలో త్వరలో మరో ఉద్యోగ నోటిఫికేషన్
- 16 వేల 940 పోస్టులకు త్వరలోనే అనుమతి
- ఇప్పటి వరకు 60,929 పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి
తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం మరో శుభావార్త వినిపించింది. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా టీఎస్పీఎస్సీ వరుస నోటిఫికేషన్లు ఇస్తోంది. ఇందులో భాగంగానే.. నాలుగు రోజుల క్రితమే 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. ఇప్పుడు మరో 16, 940 ఉద్యోగాలకు మూడు రోజుల్లో అనుమతి ఇవ్వనున్నట్టు సర్కారు ప్రకటించింది. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు, భర్తీలపై వివిధ శాఖల ఉన్నతాధికారులు, టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌తో కలిసి సీఎస్ సోమేశ్ కుమార్ భేటీ అయ్యారు. ఇప్పటి వరకు 60 వేల 929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చిందని సోమేశ్ కుమార్ వెల్లడించారు. కాగా.. మరో 16 వేల 940 పోస్టులకు మూడు రోజుల్లో అనుమతులు వస్తాయన్నారు. అయితే.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసే దిశలో ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది.
ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా.. ప్రబుత్వం 16,614 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వటమే కాకుండా.. అందుకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షలు కూడా నిర్వహించింది. డిసెంబర్ 8 నుంచి దేహదారుఢ్య పరీక్షలు కూడా నిర్వహించనుంది. ఇక.. డిసెంబర్‌లో మరో మూడు కీలక ప్రకటనలు చేయనుంది. ఇందులో గ్రూప్-2, 3, 4 నోటిఫికేషన్లు వచ్చే నెలలో జారీ చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. గ్రూప్-2, 3, 4కి సంబంధించి ఇప్పటికే ఆర్థికశాఖ అనుమతి ఇవ్వడంతో భర్తీ ప్రక్రియను టీఎస్‌పీఎస్‌సీ వేగవంతం చేసింది.