TSPSC | Gurukul Exam Dates 2023-24
జులై 01 నుంచి వరుస పరీక్షలు.. పరీక్షల తేదీల పూర్తి షెడ్యూల్ ఇదే..

తెలంగాణలో వరుస ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షల జరుగుతున్నాయి. అయితే జులై 01 నుంచి అక్టోబర్ నెల వరకు వరుస పరీక్షలు ఉన్నాయి. వీటి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించి వరుసగా పరీక్షలు జరుగుతున్నాయి. గత ఆరు నెలల నుంచి కూడా టీస్పీఎస్సీ ద్వారానే కాకుండా.. ఇతర నియామకాల సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇందులో కొన్ని పరీక్షలకు ఫలితాలు విడుదల కాగా.. మిగిలిన పరీక్షలకు నిర్వహించిన పరీక్షల ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి.
ఈ నెలలో ఇంకా టీస్పీఎస్సీ నుంచి ఏఎంవీఐ పరీక్ష జూన్ 26 తేదీన నిర్వహించనున్నారు. దీనికి అడ్మిట్ కార్డులను మరో రెండు రోజుల్లో వెబ్ సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. ఇక జులై నుంచి ఎలాంటి పరీక్షలు ఉన్నాయి.. వీటికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
గ్రూప్ 4 ఎగ్జామ్..
జులై 01న గ్రూప్ 4 పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 8100 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా.. దాదాపు 10 లక్షలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. దీనికి సంబంధించి అడ్మిట్ కార్డులు జూన్ 25వ తేదీ తర్వాత విడుదల కానున్నాయి.
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలకు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షను జులై 13న ఉదయం నిర్వహించనున్నారు. జులై 14వ తేదీన రెండు షిప్ట్ లో ఈ పరీక్షను అధికారులు నిర్వహించనున్నారు.
గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ పరీక్షలు..
జులై నెలలో గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ కు సంబంధించి పరీక్షలు నిర్వహించనున్నారు. టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు పరీక్షలు జులై 18,19,21 వ తేదీన నిర్వహించనున్నారు.
గురుకుల నియామక పరీక్షలు..
గురకుల స్కూల్స్, కాలేజీల్లో ఖాళీ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 9వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అయితే ఈ పరీక్షల తేదీలను గురుకుల నియామక బోర్డు వెల్లడించింది. ఆగస్టు 01 నుంచి ఆగస్టు 22వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను మూడు షిష్ట్ లల్లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
గ్రూప్ 2 పరీక్ష..
గ్రూప్ 2 పరీక్షను రెండు రోజుల్లో రెండు షిప్ట్ ల్లలో నాలుగు పేపర్ల పరీక్షను నిర్వహిస్తారు. నాలుగు నెలల క్రితమే ఈ పరీక్ష తేదీని ఖారారు చేశారు. ఆగస్టు 29, 30వ తేదీల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.
పాలిటెక్నిక్ లెక్చరర్స్..
పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్స్ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలను సెప్టెంబర్ 04 నంచి సెప్టెంబర్ 08వ తేదీ వరకు నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ వెబ్ నోట్ ద్వారా తెలియజేసింది.
పీఈటీ..
ఇంటర్మీడియట్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్స్ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష తేదీని టీస్పీఎస్సీ ప్రకటించింది. దీనిని సెప్టెంబర్ 11వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు.
జూనియర్ లెక్చరర్స్ పరీక్షలు..
జూనియర్ కాలేజీలో ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి పరీక్షలు సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 03వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
గ్రూప్ 3 పరీక్షలు..
టీఎస్పీఎస్సీ నుంచి మొదటి సారిగా గ్రూప్ 3 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా పదమూడు వందలకు పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఈ పరీక్ష తేదీని ఇప్పటి వరకు ఖరారు చేయాలేదు. అయితే అక్టోబర్ రెండో వారంలో ఈ పరీక్ష ఉంటే అవకాశం ఉంది.